టెక్నాలజీ దిగ్గజంగా భారత్‌

Govt to roll out 5-year strategic perspective plan to make India - Sakshi

కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: భారత్‌ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్‌ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top