గూగుల్ ఇండియాకు పాల‌సీ హెడ్ అర్చ‌న గులాటీ గుడ్ బై!

Google India Government Affairs And Public Policy Head Archana Gulati Resigned From Her Post  - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. గూగుల్‌ ఇండియా పాలసీ హెడ్‌ అర్చన గులాటీ తన పదవికి రాజీనామా చేశారు. విధుల్లో చేరిన 5 నెలల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. అయితే రాజీనామాపై అర్చన , గూగుల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఎకనమిక్స్‌ గ్రాడ్యుయేట్‌గా, ఐఐటీ-ఢిల్లీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అర్చన గులాటీ నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో జాయింట్‌ సెక్రటరీగా, అడ్వైజరీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రిటైర్మెంట్‌ ప్రకటించారు. అనంతరం ఈ ఏడాది మేలో గూగుల్‌ ఇండియా పాలసీ హెడ్‌గా చేరారు. 

ఈ క్రమంలో అర్చన గులాటీ తన పదవి నుంచి వైదొలిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, గూగుల్ దేశంలో రెండు యాంటీ ట్రస్ట్ కేసులతో పాటు కఠినమైన నిబంధనల్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో గులాటీ గుడ్‌ బై చెప్పడం గూగుల్‌కు గట్టి ఎదురు దెబ్బేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీసీఐ టూ గూగుల్‌
గతంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)లో పనిచేసే సమయంలో అర్చన గులాటీ గూగుల్‌తన స్మార్ట్‌ టీవీ మార్కెట్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పాటు యాప్‌ పేమెంట్‌ సిస‍్టం వ్యాపార వ్యవహారాల్ని ఎలా నిర్వర్తిస‍్తుందో పరిశీలించేవారు.       

కేంద్రంలో కీలక పదవులు  
అంతకముందే గులాటీ పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన కీలక విభాగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. మే 2007 నుండి ఫిబ్రవరి 2012 వరకు టెలికాం మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఆఫ్ ఇండియాలో(యూఎస్‌ఓఎఫ్‌) జాయింట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆ పదవిలో కొనసాగుతుండగా యూఎస్‌ఓఎఫ్‌ పథకాల రూపకల్పన, వాటి అమలుతో పాటు సబ్సిడీకి పంపిణీకి సంబంధించిన అంశాల రూప కల్పనలో పాలు పంచుకున్నారు.       

ఆ తర్వాత
అర్చన గులాటీ లింక్డ్‌ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెలికాం సెక్రటరీ కార్యాలయంలో స్పెషల్ డ్యూటీలో అధికారిగా,ఆగస్టు 2019 నుండి మార్చి 2021 వరకు నీతి ఆయోగ్‌లో డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి..ఏడాది పాటు ఫ్రీలాన్సర్‌గా పని చేశారు. అనంతరం ఈ ఏడాది మేలో గూగుల్‌లో చేరారు. ఐదు నెలలు తిరక్క ముందే గూగుల్‌కు అర్చన గులాటీ గుడ్‌బై చెప్పడం చర్చాంశనీయమైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top