Work From Home-Google Employees: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కీలక ప్రకటన

Google CEO Sundar Pichai Respond On Work From Home - Sakshi

Google Work From Home: వర్క్‌ఫ్రం హోం కొనసాగించడంపై మల్లాగుల్లాలు పడుతున్న కార్పోరేట్‌ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలనే అంశంపై క్లారిటీ ఇస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సైతం స్పందించింది.

ఆఫీసులకు రండి
కరోనా విజృంభనతో కార్పోరేట్‌ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. అయితే వర్క్‌ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్‌ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్‌ఫ్రం హోంపై ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది.

గూగుల్‌ సీఈవో ప్రకటన
కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్‌ వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపారు. ‘ 2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై  నిర్ణయం తీసుకుంటాం’ అని మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.

అందరిదీ అదే దారి
డెల్టా వేరియంట్‌ విజృంభణకు తోడు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నందున ఇప్పటికే అమెజాన్‌ , లైఫ్ట్‌ వంటి సంస్థలు వర్క్‌ఫ్రం హోంను కొనసాగిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాదిలో పరిస్థితులను బట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలా ? వద్దా ? అనేది నిర్ణయిస్తామని ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో గూగుల్‌ కూడా చేరింది. 

చదవండి : Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్‌ మరో మాట!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top