Flipkart Offers: మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం

Good time to buy ac on flipkart great offers - Sakshi

అసలే ఎండలు మండిపోతున్నాయి, భానుడి ఉష్ణోగ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది ఎయిర్ కూలర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే AC ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది కొనటానికి సంకోచిస్తారు. అలాంటి వారికోసం ఫ్లిప్​కార్ట్​ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చింది.

దేశీయ ఆన్​లైన్​ ఈ-కామర్స్​ కంపెనీ ఫ్లిప్​కార్ట్​ కొత్త ఏసీ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కథనంలో భారతీయ విఫణిలో రూ. 40,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీలను గురించి తెలుసుకుందాం..

ఎల్​జీ ఏఐ కన్వర్టెబుల్​​ 2023 మోడల్​ 1.5 టన్​ 3 స్టార్​ ఏసీ:

ఎల్​జీ కంపెనీకి చెందిన 1.5 టన్​ ఎల్​జీ ఏసీ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 37,990. యెస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై 10 శాతం లేదా రూ.1500 వరకు ఆఫర్స్​ పొందవచ్చు. ఇందులో 6 ఇన్​ 1 కూలింగ్​ మోడ్ ఉంటుంది. అంతే కాకుండా ఏఐ డ్యూయెల్​ ఇన్వర్టర్​ 2 వే స్వింగ్​, హెచ్​డీ ఫిల్టర్​ విత్​ యాంటీ వైరస్​ ప్రొటెక్షన్​ వంటి ఫీచర్స్​ కూడా ఇందులో లభిస్తాయి.

శాంసంగ్​ కన్వర్టెబుల్​​ 2023 మోడల్​ 1.5 టన్​ 3 స్టార్​ ఏసీ:

శాంసంగ్ కంపెనీకి చెందిన 2023 మోడల్​ 1.5 టన్​ 3 స్టార్​ ఏసీ ధర దేశీయ మార్కెట్లో రూ. 35,499. యెస్ ​బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​తో 10% లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఏసీలో 5 ఇన్​ 1 కూలింగ్​ మోడ్ ఉండటం వల్ల పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది.

బ్లూ స్టార్​ కన్వర్టెబుల్​ 2023 మోడల్​ 1.5 టన్​ 3 స్టార్​ ఏసీ:

మార్కెట్లో 1.5 టన్​ బ్లూ స్టార్​ ఏసీ ధర రూ. 36,190. యెస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​తో కొనుగోలుచేసే కస్టమర్లు ఇప్పుడు 10% ఆఫర్ పొందవచ్చు. ఈ ఏసీలో 4 ఇన్​ 1 కూలింగ్​ మోడ్ ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది. సెల్ఫ్​ డయగ్నాసిస్​, డస్ట్​ ఫిల్టర్​, స్టెబులైజర్​ ఫ్రీ ఆపరేషన్​ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి.

వోల్టాస్​ 1.5 టన్​ 3 స్టార్​ స్ప్లిట్​ ఇన్వర్టర్​ ఏసీ:

వోల్టాస్​ కంపెనీకి చెందిన 1.5 టన్ ఏసీ ధర రూ. 33,490 మాత్రమే. యెస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై 10 శాతం లేదా రూ.1,500 వరకు డిస్కౌంట్​ పొందవచ్చు. ఇందులో ఆటో అడ్జెస్టెబుల్​ టెంపరేచర్​ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top