మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్‌..

gold sales surge up to 30pc during festive season despite rise in rates - Sakshi

Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో పండుగ సీజన్‌లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్‌  డైమండ్స్, పీఎన్‌జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్‌ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. 

ధరలు పెరుగుతున్నా..
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. 

శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్‌జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు.

 

టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని  మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు.

ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు.

ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.. మొబైల్‌కే బంగారం ధరలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top