కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు | FPIs turn net buyers in local equities in the first fortnight of December | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు

Dec 16 2024 4:39 AM | Updated on Dec 16 2024 6:50 AM

FPIs turn net buyers in local equities in the first fortnight of December

రూ. 22,766 కోట్ల పెట్టుబడులు 

గత నెలలో దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్‌)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్‌ సొంతం చేసుకున్నారు. 

ఇందుకు ప్రధానంగా యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్‌లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement