3 వేలమందిపై వేటు వేసిన లగ్జరీ కార్‌ మేకర్‌

Ford confirms to layoff 3kstaff USA and India Report - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్‌ మేకర్‌, అమెరికాకుచెందిన ఫోర్ట్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది.  దాదాపు 3 వేలమందికి పైగా ఉద్యోగులను  తొలగించినట్టు అధికారికరంగా ఫోర్డ్‌ ధృవీకరించింది. ఉద్యోగాల కోత సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫోర్డ్‌ అధికార ప్రతినిధి తెలిపారు.  (‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్‌: నెక్ట్స్‌ మంత్‌ నుంచి)

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ సంతకం చేసిన ఇమెయిల్‌ పోస్ట్‌ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.  3వేల మంది ఉద్యోగులు, మరికొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు ఫోర్ట్‌ తెలిపింది. ఈ మేరకు ఫోర్డ్ ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్ సమాచారం అందించింది. ఈ కోతలు ప్రధానంగా అమెరికా, కెనడా, ఇండియాలోని సిబ్బందిని ప్రభావితం చేసింది. (జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా... కానీ ఇక్కడో ట్విస్ట్‌)

ఫోర్డ్‌లో చాలామంది ఉద్యోగులున్నారని, ఎలక్ట్రిక్, కొత్త సాఫ్ట్‌వేర్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోకు మారడానికి అవసరమైన నైపుణ్యం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు లేదని ఫార్లే ఇటీవల చెప్పారు. 2026 నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా వెల్లడించడం గమనార్హం. అప్పటికి 10 శాతం ప్రీ-టాక్స్ ప్రాఫిట్‌ మార్జిన్‌ను చేరుకోవాలని, గత ఏడాది ఇది 7.3 శాతంగా ఉందని చెప్పారు న్యూటెక్నాలజీకి మారడం, వాహనాల అధునాతన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి లాంటి పరిణామాల నేపథ్యంలో నిర్వహణా విధానాన్ని మారుస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top