
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త ఎలక్ట్రానిక్ బిల్(ఈ-బిల్) ప్రాసెసింగ్ సిస్టమ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఎనిమిది శాఖలతో మొదలుపెట్టిన ఈ విధానాన్ని 2022-23లో అన్ని శాఖలు, విభాగాల్లో దశలవారీగా అమల్లోకి తేనున్నారు. సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని 46వ సివిల్ అకౌంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కాంట్రాక్టరు లేదా సరఫరాదారు తమ క్లెయిమ్‌లను నేరుగా డిజిటల్ విధానంలో దాఖలు చేయొచ్చని ఆమె చెప్పారు. డిజిటల్ సిగ్నేచర్‌తో కూడిన క్లెయిమ్ ప్రభుత్వానికి అందగానే కాంట్రాక్టరుకు పేమెంట్ జమవుతుందన్నారు. బాకీలను విడుదల చేయాలంటూ అధికారులు, శాఖల చుట్టూ తిరగనక్కర్లేదని, నెలల తరబడి నిరీక్షించనక్కర్లేదని మంత్రి తెలిపారు.
(చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!)