ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరింత వేగంగా... కేవలం 45 నిమిషాల్లోనే...! | Flipkart launches 45 minutes grocery delivery | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరింత వేగంగా... కేవలం 45 నిమిషాల్లోనే...!

Feb 20 2022 9:12 AM | Updated on Feb 20 2022 10:01 AM

Flipkart launches 45 minutes grocery delivery - Sakshi

కరోనా రాకతో ఆన్లైన్ గ్రాసరీ సేవలు మరింత ఊపందకున్నాయి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్ధలు సైతం ఆన్లైన్ గ్రాసరీ సేవలను మొదలు పెట్టాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా గ్రాసరీస్ సేవలను కూడా అందిస్తున్నాయి. ఐతే  బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డుంజో వంటి సంస్థలు 15 నుంచి 20 నిమిషాల్లోనే డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం 10 నుంచి 20 నిమిషాల డెలివరీ సర్వీసులు అందించడం కష్టమని అభిప్రాయపడింది.  

45 నిమిషాల్లోనే డెలివరీ... 
ఆర్డర్ చేసిన కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇప్పటికే  కంపెనీ బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించింది. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డెలివరీ సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులు అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయంతో 90 నిమిషాల డెలివరీ సర్వీసులు ఇప్పుడు 45 నిమిషాలకే రానున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ క్విక్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.  

అంతా సులువు కాదు...!
15 నుంచి 20 నిమిషాల్లో డెలివరీ అనేది దీర్ఘకాలంలో కరెక్ట్ బిజినెస్ మోడల్ కాదని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి కృష్ణమూర్తి తెలిపారు. స్థిరమైన బిజినెస్ మోడల్ 30 నుంచి 45 నిమిషాల డెలివరీ సర్వీసులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్లో ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో ఫ్రూట్ డోర్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని, మరిన్ని ప్రాంతాలకు వీటిని విస్తరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement