
ఎండలు మండిపోతున్నాయి.. బయటే కాకూండా ఇంట్లో కూడా ఉక్కపోత ఎక్కువైపోతోంది. ఈ తరుణంలో దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 7వ ఎడిషన్ సూపర్ కూలింగ్ డేస్ (2025 ఏప్రిల్ 16 నుంచి 24 వరకు) కార్యక్రమాన్ని ప్రకటించింది. సంస్థ ప్రకటించిన నిర్దిష్ట రోజుల్లో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్‌లపై మంచి ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి తక్కువ ధరతో వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ కింద.. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ, ప్రముఖ బ్యాంకుల ఆఫర్‌లు, సూపర్‌కాయిన్ రిడెంప్షన్‌లు వంటి వివిధ రకాల ఫైనాన్సింగ్ ఎంపికలను ఎంచుకుని ఎంపిక చేసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను కూడా కస్టమర్లు సద్వినియోగం చేసుకుని రూ.8000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్ కండిషనర్లు: వోల్టాస్, ఎల్‌జీ, బ్లూ స్టార్ వంటి బ్రాండ్ ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు మీద గరిష్టంగా 55 శాతం తగ్గింపును పొందవచ్చు. కేవలం రూ. 26,490 ప్రారంభ ధర వద్ద లభించే ఏసీలు ఇన్వర్టర్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్‌లు వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతాయి.
ఎయిర్ కూలర్స్: బజాజ్, కెన్‌స్టార్, హింద్‌వేర్ వంటి అగ్ర బ్రాండ్‌ల నుంచి పర్సనల్, డెజర్ట్, టవర్ మోడల్స్ మీద తగ్గింపులు లభిస్తాయి. పర్సనల్ కూలర్స్ ధరలు రూ. 3999 నుంచి, డెజర్ట్ కూలర్స్ ధరలు రూ. 4999 నుంచి ప్రారంభమవుతాయి.
రిఫ్రిజిరేటర్స్: రిఫ్రిజిరేటర్లు కేవలం ఎండాకాలంలో మాత్రమే కాకుండా.. ఏడాది పొడవునా అవసరమే. అయితే సూపర్ కూలింగ్ డేస్ సందర్భంగా.. సుమారు 60 శాతం తగ్గింపుతో కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయొచ్చు. సింగిల్-డోర్ ఫ్రిజ్‌ల నుంచి విశాలమైన డబుల్-డోర్, సైడ్-బై-సైడ్ డోర్స్ వరకు అన్నీ ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ. 9900 నుంచి రూ. 1.07 లక్షల వరకు ఉంటాయి.