నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్‌లాండ్ ట్రిప్! | First Year College Student Earns Rs 4 Lakh a Month as an Intern | Sakshi
Sakshi News home page

నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్‌లాండ్ ట్రిప్!

Jul 4 2026 8:07 PM | Updated on Jul 4 2026 8:31 PM

First Year College Student Earns Rs 4 Lakh a Month as an Intern

ఇంటర్న్‌షిప్‌లు అనుభవాన్ని సంపాదించుకోవడానికి విద్యార్థులకు లభించే అవకాశాలు. కానీ కొందరికి అవే జీవితాన్ని మార్చే మలుపులుగా మారిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫస్ట్ ఇయర్ చదువుతున్న కాలేజ్ స్టూడెంట్ 'సిద్ధార్థ్ దుబే' టాప్‌మేట్‌ అనే టెక్ స్టార్టప్‌లో సేల్స్ ఇంటర్న్‌గా చేరాడు. అతనికి ఎలాంటి అనుభవం లేకపోయినా.. తన ప్రతిభతో నెలకు రూ.4 లక్షల స్టైపెండ్ అందుకున్నాడు. అంతే కాకుండా.. కంపెనీ ఖర్చులతో థాయ్‌లాండ్ ట్రిఫ్‌ను గిఫ్ట్‌గా గెలుచుకున్నాడు.

ఐఐటి పూర్వ విద్యార్థి, టాప్‌మేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన దినేష్ సింగ్.. సిద్ధార్థ్ దుబే స్టోరీని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ చాలా వేగంగా వైరల్ అయింది.

దినేశ్ సింగ్ తన పోస్టులో వివరిస్తూ.. సిద్ధార్థ్ తన టీమ్‌లో అతి చిన్న వయస్సు వాడైనప్పటికీ.. పెద్ద అనుభవం లేనప్పటికీ అతనిలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, కొత్త వ్యక్తులతో మాట్లాడి వారి అవసరాలను అర్థం చేసుకుని నమ్మకాన్ని ఏర్పరచగల సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి. గత నెలలో అత్యధిక సేల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. అతని పనితీరు చూసి కంపెనీ అతనికి స్పెషల్ గిఫ్ట్‌గా  పూర్తిగా ఖర్చులు భరించి థాయిలాండ్ ట్రిప్ కూడా ఇచ్చింది.

ఈ కథ చాలా మందికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేవలం డిగ్రీలు లేదా సర్టిఫికెట్లు మాత్రమే కాదు, మనం మాట్లాడే విధానం, ఆలోచన, ప్రవర్తన కూడా కెరీర్‌లో పెద్ద మార్పు తీసుకురాగలవు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా మంది స్పందించారు. కొందరు ఇది 'టాలెంట్ + అవకాశం' కలిసిన ఉదాహరణ అని చెప్పగా, మరికొందరు 'ప్రతిభకు వయసుతో పనిలేదని' వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement