
ట్రెండ్‌ను ఫాలో అయ్యేవాళ్లు కొందరుంటారు.. మరికొందరు ట్రెండ్‌ను సృష్టిస్తారు..ఇదిగో ఇలాగన్నమాట.. ఇవేంటో మీకు తెలుసా? వ్యాక్సిన్ రెడీ డ్రస్సులు.. మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది కదా.. దీన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు ‘రివాల్వ్’ అనే బ్రాండ్ వ్యాక్సిన్ రెడీ పేరిట ఈ దుస్తులను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి టీకా వేసుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. స్టైలిష్‌గా కూడా ఉంటాయని సదరు కంపెనీ చెబుతోంది. ఎలాగుంది ఈ ఐడియా.. సూపర్ కదూ..