ఈ ఫీచర్‌తో మీ ఫోన్‌లో డేటా ఎవరి చేతుల్లోకి వెళుతుందో తెలుసుకోవచ్చు

Duckduckgo Launches New Tool To Block Apps From Tracking Android Users - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌.. కొందరికి అవసరం.. మరికొందరి వ్యసనం. ఆ వ్యసనాన్ని క్యాష్‌ చేసుకునేందుకు యాప్స్‌ వెలుగులోకి వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని యాప్స్‌ యూజర్ల అవసరాల్ని తీర్చేలా ఉన్నా..మరికొన్ని మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా యూజర్ల ఫోన్‌లలో చొరబడుతున్నాయి. ఫ్రీగిఫ్ట్‌లు, ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ పేరుతో యూజర్ల ఆశలకు గాలం వేస్తున్నాయి. దీంతో టెక్నాలజీపై అవగాహన లేని యూజర్లు యాప్స్‌ వలలో చిక్కుకుంటున్నారు. వ్యక్తిగత వివరాల్ని అందిస్తున్నారు. ఆ వివరాల్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..అలాంటి డేంజర్‌ యాప్స్‌కు చెక్‌ పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సూపర్‌ ఫీచర్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ ఫీచర్‌ బీటా వెర్షన్‌లో ఉండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 

96శాతం యాక్యురేట్‌ రిజల‍్ట్‌ 
సెర్చ్‌ ఇంజిన్‌ "డక్ డక్ గో" త్వరలో ఫీచర్‌ను విడుదల చేయనుంది. ' యాప్‌ ట్రాకింగ్‌ ప్రొటెక్షన్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌లో మీకు తెలియకుండా ఏమైనా యాప్స్‌, సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర్‌ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థలు ఏం చేస్తున్నాయో ఇట్టే కనిపెట్టేస్తుంది. మీ ఫోన్‌లో ఆ యాప్స్‌ను వినియోగించకపోయినా నిరంతరం ట్రాక్‌ చేస్తుంది. ఇటీవల డక్‌ డక్‌ గో' కొన్ని యాప్స్‌ను ట్రాకింగ్‌ చేసింది. ట్రాకింగ్‌లో థర్డ్‌ యాప్స్‌ నిర్వాహకులు  87 శాతం డేటాను గూగుల్‌కి , 68శాతం డేటా ఫేస్‌బుక్‌కు పంపించినట్లు గుర్తించింది. 

యాపిల్‌ సైతం  
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ యాప్స్‌ మన డేటా కలెక్ట్‌ చేస్తున్నాయా? లేదా అనే విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు ఎలాంటి యాప్స్‌ అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ యాప్‌ ట్రాకింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు సంబంధించిన గాడ్జెట్స్‌ను థర్డ్‌ పార్టీ యాప్స్‌ ట్రాక్‌ చేయొచ్చా' అనే అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఒప్పుకుంటేనే థర్డ్‌ పార్టీ యాప్స్‌ ట్రాక్‌ చేస్తాయి. అయితే యాపిల్‌ ఫీచర్‌పై యూజర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది థర్డ్‌ పార్టీ యాప్స్‌ వద్దు' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 

చదవండి: పాపం జుకర్‌ బెర్గ్‌: వేల కోట్ల నష్టం..పేరు మార్చినా..! జాతకం మారలేదు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top