ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

DoT Advisory Against Calls Threatening Disconnection Mobile Services - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు, కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి మీ సిమ్ కార్డు సర్వీస్ నిలివేస్తున్నట్లు, ఆలా జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మోసాలపైన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DOT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వినియోగదారులకు ఫోన్ చేసి మరి కొన్ని గంటల్లో సిమ్ డీయాక్టివేట్ అవుతుందని, సర్వీస్ నిలిపివేయనున్నట్లు భయపెడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని వివరాలు కావాలని అడుగుతారు. ఇది నిజమే అని నమ్మి వివరాలు వెల్లడిస్తే మోసాలు జరుగుతాయని DOT వెల్లడిస్తూ.. ఎవరూ ఇలాంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించింది.

ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?

మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఇలాంటి కాల్స్ తరచూ వస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కి ఫిర్యాదు చేయవచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ అరికట్టడానికి కొన్ని సంస్థలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top