డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్‌లోడ్‌ చేశారా..?

Digital Health ID Card 2021: How To Apply, Registration, Benefits - Sakshi

న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం సెప్టెంబర్ 27న సరికొత్త  పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం.. ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో పొందుపరుస్తారు. 

దీంతో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే చికిత్స రికార్డ్‌లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ  కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది. ఇక నుంచి ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది.(చదవండి: కార్లకు డిజిటల్‌ ‘కీ’ స్‌ తయారుచేయనున్న శాంసంగ్‌)

డీజీటల్ హెల్త్ ఐడీ కార్డ్ 2021 ఆన్‍లైన్ దరఖాస్తు విధానం: 

  • ఎన్డిహెచ్ఎమ్‌ హెల్త్ ఐడీ కార్డ్ కోసం(https://healthid.ndhm.gov.in/register) పోర్టల్ ఓపెన్ చేయండి
  • రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి.
  • ఇప్పుడు, మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. 
  • మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. 
  • ఆధార్ కార్డు లింక్ మీద క్లిక్ చేసి వివరాలను నమోదు చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
  • హెల్త్ ఐడీ కార్డ్ సృష్టించబడిన తర్వాత వ్యక్తి యూజర్ నేమ్ నమోదు చేయండి.
  • అలాగే, కొన్ని వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
  • ఆ తర్వాత, మీరు డిజిటల్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top