కార్లకు డిజిటల్‌ ‘కీ’ స్‌ తయారుచేయనున్న శాంసంగ్‌ | Samsung To Bring Digital Car Keys To Its Phones | Sakshi
Sakshi News home page

Samsung: కార్లకు డిజిటల్‌ ‘కీ’ స్‌ తయారుచేయనున్న శాంసంగ్‌

Oct 3 2021 5:05 PM | Updated on Oct 3 2021 5:07 PM

Samsung To Bring Digital Car Keys To Its Phones - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌​ దిగ్గజం శాంసంగ్‌ త్వరలోనే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి డిజిటల్‌ కారు ‘కీ’ స్‌ను తయారుచేయనుంది. అల్ట్రా-వైడ్‌బ్యాండ్ (యుడబ్ల్యుబీ), నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సి)-ఎనేబుల్డ్ డిజిటల్ కార్ కీస్‌కు త్వరలోనే శాంసంగ్‌ ఆవిష్కరించనుంది. ఈ డిజిటల్‌ ‘కీ’ స్‌ తొలుత దక్షిణ కొరియా ప్రవేశపెట్టాలని శాంసంగ్‌ భావిస్తోంది. అన్ని ఎలక్ట్రిక్ జెనెసిస్ జివి 60 కార్లకు శాంసంగ్‌ కీస్‌ను తయారుచేయనుంది.
చదవండి: టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..!

గెలాక్సీ ఎస్ 21 లాంచ్ సమయంలో తన ఫోన్‌లలో డిజిటల్ కార్ కీస్‌ కోసం ప్రణాళికలను ప్రకటించింది.  ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పలు శాంసంగ్‌ మోడళ్లలో తెచ్చేందుకు శాంసంగ్‌ ప్రయత్నాలను చేస్తోంది. ది వెర్జ్ కథనం  ప్రకారం, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ , శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 21 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, ఫోల్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్స్‌  యుడబ్ల్యుబి సాంకేతికతను మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో పలు ఎలక్ట్రానిక్‌ వాహనాలను కీస్‌ లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి స్టార్ట్‌ చేయవచ్చును. ఈ టెక్నాలజీ సహాయంతో  కార్‌ విండోస్‌ను కూడా ఆపరేట్‌ చేయవచ్చును. 

డిజిటల్ కీలు శామ్‌సంగ్ పాస్‌ యాప్‌లో భద్రంగా నిల్వ ఉంటాయి.  . ఎంబెడెడ్ సెక్యూర్ ఎలిమెంట్ (ఇఎస్‌ఇ)" ద్వారా డిజిటల్‌ కీస్‌ను రక్షిస్తాయి. ప్రస్తుతం శాంసంగ్‌ కేవలం జెనెసిస్ జివి 60 కార్లకే మాత్రమే డిజిటల్‌ కీస్‌ పనిచేయనున్నాయి.ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, ఫోర్డ్‌ వంటి దిగ్గజ ఆటో మొబైల్‌ కంపెనీలతో శాంసంగ్‌  భాగస్వామ్యాన్ని కల్గిఉంది. భవిష్యత్తులో భారీ ఎత్తున్న ఆటోమొబైల్‌ కంపెనీలకు ఎన్‌ఎఫ్‌సీ డిజిటల్‌ కీస్‌ను తయారుచేసేందుకు శాంసంగ్‌ సన్నాహాలను చేస్తోంది. 
చదవండి: ‎టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement