యులిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌

Demand to Unit linked insurance policies - Sakshi

ఎక్సైడ్‌ లైఫ్‌ సీడీవో రాహుల్‌ అగర్వాల్‌ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం పాలసీదారులు తమ ఆర్థిక అవసరాలు, లక్ష్యాల సాధన కోసం యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు (యులిప్‌లు), గ్యారంటీ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రైవేట్‌ రంగ జీవిత బీమా సంస్థ ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ (సీడీవో) రాహుల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తాము ఇటీవలే ఎక్సైడ్‌ లైఫ్‌ స్మార్ట్‌ ఇన్‌కం ప్లాన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఇటు జీవితాంతం లైఫ్‌ కవరేజీ ఇవ్వడంతో పాటు అటు క్రమానుగతంగా ఆదాయం కూడా అందించే సాధనమని వివరించారు.

మరోవైపు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్‌ ప్లాన్‌ తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పాలసీలంటే మరణానంతరం మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాధనాలుగా ఒక ప్రతికూల అభిప్రాయం ఉండటం వల్ల వీటి గురించి మాట్లాడేందుకు ఎక్కువగా ఎవరూ ఇష్టపడరని అగర్వాల్‌ చెప్పారు. అయితే, కోవిడ్‌ రాకతో పరిస్థితులు మారాయని, జీవితంలో అనిశ్చితి గురించి అందరూ గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌ పరిణామాల అనంతరం తాము కూడా  గణనీయంగా డిజిటల్‌కు మళ్లుతున్నామని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top