ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ రూల్స్‌ మారుతున్నాయ్‌.! టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి?

Debit Card And Credit Card Rules Change From Jan1,2022  - Sakshi

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. చేసిన మార్పులు జనవరి 1 నుంచి అమలవుతాయని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు చేసిన మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్‌ లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. 

కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లలో కార్డ్‌,వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్‌ చేసే పనిలేకుండా టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  ఆ టోకనైజేషన్‌  అంటే ఏమిటీ? ఆ టోకనైజేషన్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం. 

టోకనైజేషన్‌ అంటే ?
వినియోగదారుల డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్‌ జరిపే సమయంలో కార్డ్‌ వివరాలు సైబర్‌ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్‌ గా ఉంచే వ్యవస్థనే టోకెన్‌ అంటారు. ట్రాన్సాక్షన్‌ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్‌ నెంబర్‌ను ఎంట్రి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్‌ వివరాలు, సీవీవీ నెంబర్‌లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. 

టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి?

 ►ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్‌లు నిర్వహించే సమయంలో మీ కార్డ్‌ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి.

 ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. 

► ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.

తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది

చదవండి: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top