ఏటీఎంలు ఎక్కడెక్కువో మీకు తెలుసా?

This Countries With The Highest Number Of ATMs - Sakshi

ఈ మధ్య మన దగ్గర ఏటీఎంల దొంగతనాలు ఎక్కువయ్యాయి కదా.. అసలు ఏటీఎం అంటే గుర్తుకొచ్చింది.. ఈ ప్రపంచానికే ఏటీఎం రాజధాని ఏమిటో మీకు తెలుసా? దక్షిణ కొరియా.. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. అక్కడ ప్రతి లక్ష మందికి 267 ఏటీఎంలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో కెనడా ఉంది.. అమెరికాది నాలుగో స్థానం.. ఇంతకీ మన పరిస్థితి ఏంటనేగా మీ డౌటు.. ఇక్కడ ప్రతి లక్ష మందికి 21 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్యాష్‌లెస్‌ పేమెంట్స్‌ విషయంలోనూ దక్షిణ కొరియావాళ్లే ముందున్నారు.. వాళ్లు నగదు లావాదేవీలకు పెద్దగా మొగ్గు చూపడం లేదని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చింది.. అదే సమయంలో అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏటీఎంలు ఉండటం విశేషం.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top