ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ!

Chinese EV Maker Xpeng Plans To Mass Produce Flying Cars By 2024 - Sakshi

ప్రముఖ చైనీస్ ఎలక్ట్రిక్-వేహికల్ తయారీ సంస్థ ఎక్స్ పెంగ్ ఎగిరే కారును ఆవిష్కరించింది. ఈ ఎగిరే కారును 2024 నాటికి మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు పేర్కొంది. గత వారం ఫండింగ్ సేకరణలో భాగంగా 500 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సంస్థ సేకరించింది. ఎక్స్ పెంగ్ గత కొంత కాలంగా ఎక్స్2 కారును అభివృద్ధి చేస్తోంది. ఈ టూ సిటర్ ఎలక్ట్రిక్ కారును పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. చైనాలో టెస్లాకు బలమైన పోటీదారులలో ఒకరైన ఎక్స్ పెంగ్ టెస్లా కంటే మూడు చౌకైన ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను ప్రారంభించింది. 

2021 మొదటి అరునెలల్లో ఈ చైనా సంస్థ 3,000కు పైగా ఏలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే వార్షికంగా 459% పెరుగుదల కనబరిచింది. ఎక్స్ పెంగ్ ఎక్స్2 కారులో ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు. ఎక్స్ పెంగ్ ఎగిరే కారు విమానాశ్రయం నుంచి పని చేసే కార్యాలయానికి చేరువకోవడం కోసం అనువుగా ఉంటుంది అని సంస్థ తెలిపింది. వాహనం ఒకేసారి 35 నిమిషాల వరకు ఎగరగలదు. నాస్ డాక్ లిస్టెడ్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఈ కారును 1.18 కోట్ల రూపాయల కంటే తక్కువ(1 మిలియన్ చైనీస్ యువాన్ ఆఫ్ యుఎస్ 157,000 డాలర్లు) అందించాలని చూస్తుంది. మిగతా వాటితో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. జనరల్ మోటార్స్, టయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలతో ఈ సంస్థ పోటీ పడుతుంది.

(చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top