Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Telugu Celebrities Caught At Bengaluru Rave Party Details
రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్‌ ప్రముఖులు!

బెంగళూరు, సాక్షి: ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.సదరు జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌ కాన్‌కార్డ్‌ సంస్థకు గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్‌ రేవ్‌ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్‌ ​ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్‌ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు.

BRS MLC K Kavitha delhi liquor case Judicial Remand Update
కల్వకుంట్ల కవితకు ముగిసిన కస్టడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. ఇవాళ( సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్‌ జైలు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కవితపై ఈడీ చార్జి షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రౌస్‌ అవెన్యు కోర్టు న్యాయమూర్తి కవిత చార్జి షీటును నేడు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.

ap elections 2024 may-20th political updates telugu
May 20th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 20th AP Elections 2024 News Political Updates10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్‌!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్‌ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్‌ రిపోర్ట్‌ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్‌ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్‌ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్‌ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్‌ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్‌ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్‌ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్‌ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్‌సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్‌ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్‌లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్‌ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్‌ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్‌ టీం కష్టం ఉందన్న సీఎం జగన్‌జగన్‌ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం‌ జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్‌ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్‌లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పం‌పనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొ‌న్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్‌’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్‌ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్‌ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్‌ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్‌

Man of the Masses Jr NTR Birthday Special Story
Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా ఎన్టీఆర్‌ ఎలా ఎదిగాడు..?

ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ట్రెండింగ్‌లో ఉన్న పేరు. రౌద్రం, బీభత్సం, వీరం, కరుణ, శాంతం, హాస్యం.. ఇలా నవరసాలను సులభంగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్‌ టాప్‌లో ఉంటారు. వెండితెరపై 'నిన్ను చూడాలని' థియేటర్‌లో అభిమానులు 'రభస' చేస్తే.. ఆంధ్రుల 'సింహాద్రి'గా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద 'బాద్‍షా'గా నీ 'దమ్ము' ఏంటో చూపించావ్‌. 'జనతా గ్యారేజ్'తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టే 'యమదొంగ' అయ్యావ్‌. అందుకే నేడు నీ అభిమానులు కూడా మా 'దేవర' అంటూ.. ప్రాణంగా అభిమానిస్తున్నారు. 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా కొన్ని విషయాలు మీకోసం. తాతను మెప్పించిన తారక్‌.. ఎంట్రీ ఎలా జరిగింది1983 మే 20న జన్మించిన తారక్‌ ఓ రోజు మేజర్‌ చంద్రకాంత్‌ షూటింగ్‌ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్‌ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్‌ వేయమని చెప్పారు. మేకప్‌ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్‌ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్‌ అని కితాబు ఇచ్చారు.మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్‌ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు1996లో బాల రామాయణంలో నటించిన తారక్‌ ఆ తర్వాత సినిమా ఛాన్స్‌ల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు. బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా తార‌క్ అవ‌కాశాల కోసం తిరిగాడు. ఈ క్రమంలో తారక్‌కు 'భక్త మార్కాండేయ' అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్‌ తర్వాత 'నిన్ను చూడాల‌ని' సినిమాలో హీరోగా అవ‌కాశం వ‌చ్చింది. వి.ఆర్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్రమంలో ఎస్ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా తన తొలి చిత్రం తార‌క్‌తో 'స్టూడెంట్ నం.1' తెర‌కెక్కించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తార‌క్‌ను హీరోగా నిలబెట్టింది. దీని త‌ర్వాత 'సుబ్బు' డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలోనే తార‌క్‌ జీవితంలోకి వివి వినాయ‌క్ ఎంట్రీ ఇచ్చాడు. 'ఆది' క‌థ‌ను తారక్‌ వినిపించడం. అది న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 2001లో విడుద‌లైన ఈ సినిమా తార‌క్ కెరీర్‌నే మార్చేసింది. దీందో టాలీవుడ్‌ స్టార్‌ హీరలో లిస్ట్‌లో ఆయన చేరిపోయాడు. ఆ తర్వాత అల్లరి రాముడు కాస్త పర్వాలేదు అనిపించినా నాగతో మరో డిజాస్టర్‌ అందుకున్నాడు. అప్పుడు రాజమౌళితో సింహాద్రి చిత్రాన్ని అందించాడు. స్టార్‌ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అక్కడి నుంచి తారక్‌ ఎదురులేకుండా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు.అంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్‌, రాఖీ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించకపోయిన ఆయన ఫ్యాన్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రాల తర్వాత 'యమదొంగ'తో తిరిగొచ్చాడు తారక్‌. మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత కంత్రితో ప్లాప్‌ సినిమా ఇచ్చాడు. ఆ వెంటనే అదుర్స్‌, బృందావ‌నం బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుని తన క్రేజ్‌ను మ‌రింత పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన 'శ‌క్తి' ప్రేక్ష‌కులనే కాదు తార‌క్ అభిమానుల‌ను కూడా తీవ్రంగా నిర‌శాపరిచింది. ఆ తర్వాత తారక్‌ కెరియర్‌లో వరుస ఫ్లాపులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.ఊస‌ర‌వెల్లి, ద‌మ్ము, బాద్‌షా, రామ‌య్య‌వ‌స్తావ‌య్యా, ర‌భ‌స వంటి వ‌రుస ఫ్లాప్‌లు రావడంతో తార‌క్‌తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ‌పడ్డారు. అలాంటి సమయంలో తారక్‌కు కచ్చితంగా ఒక హిట్‌ కావాలి. సరిగ్గా అదే టైమ్‌లో 'టెంప‌ర్' క‌థ‌తో ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు డైరెక్టర్‌ పూరి వ‌చ్చాడు. అప్పటికే ఇద్దరి కెరియర్‌లో ప్లాపులు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్‌ ఏంటి అంటూ తారక్‌పై విమర్శలు వచ్చాయి. కానీ పూరిపై నమ్మకం పెట్టుకున్నాడు తారక్‌. ఇంకేముంది, 2015లో టెంపర్‌ విడుదలైంది. అందులో ఎన్టీఆర్‌ను పూరి సరికొత్తగా చూపించాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌. మళ్లీ తారక్‌ దండయాత్ర ప్రారంభమైంది.ఆ త‌ర్వాత‌ నాన్న‌కు ప్రేమ‌తో, జన‌తాగ్యారెజ్‌, జై ల‌వ‌కుశ‌, అరవింద స‌మేత వరుస హిట్లతో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయాడు తారక్‌. టెంపర్‌ తర్వాత తన పంతాను మార్చుకున్నాడు. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే తారక్‌ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమాల తర్వాత సుమారు మూడేళ్ల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కేటాయించాడు. ఈ కష్టం వృధా కాలేదు. తారక్‌ను పాన్‌ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లింది. ఆస్కార్‌ అవార్డ్‌ను అందుకునేంత ఎత్తుకు చేర్చింది. ఈ సినిమా అనంతరం తారక్‌ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి. కొరటాల శివతో దేవర విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో వార్‌2, ప్రశాంత్‌ నీల్‌తో మరో పాన్‌ ఇండియా సినిమా ఇలా ఆయన చేతిలో అన్నీ కూడా భారీ ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. తారక్‌ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్‌ స్టార్స్‌ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్‌ ఫాలోయింగ్‌ అలాంటిది. ఇండియన్‌ మార్కెట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్‌ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం♦ తారక్‌ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివిన ఆయన సెయింట్‌ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు.♦ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకున్నారని టాక్‌. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.♦ యమదొంగ, కంత్రి, అదుర్స్‌, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్‌ మెప్పించారు.♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్‌. బాద్‌షా సినిమా జపాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్‌ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్‌ వాటంన్నిటినీ సింగిల్‌ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్‌ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.♦ నంబర్‌ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్‌. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.♦ 'ఫోర్బ్స్‌ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.♦ పూరీ జగన్నాథ్‌- ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్‌ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.♦ 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు♦ కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్‌♦ బాల రామాయణము,ఆది నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డును అందకున్నాడు ♦ తారక్‌కు ఫేవరెట్‌ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట♦ తారక్‌- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్‌, భార్గవ్‌). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్‌ ఓ సందర్భంలో చెప్పారు.♦ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు

Lok Sabha Elections 2024: Fifth Phase Polling Updates In Telugu
లోక్‌సభ ఎన్నికలు 2024: కొనసాగుతున్న ఐదో విడత పోలింగ్‌

Updates మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్‌ రావల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్‌, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్‌ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్‌ హీరో ఫర్హాన్‌ అక్తర్‌, డైరెక్టర్‌ జోయా అక్తర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్‌ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్‌:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్‌లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్‌బిహార్‌లోని ముజఫర్‌ నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్‌లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్‌ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్‌ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్‌ సాధించేలా ఓటర్లు పోలింగ్‌ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌(లక్నో), పియూశ్‌ గోయల్‌( నార్త్‌ ముంబై), కౌశల్‌ కిశోర్‌(మోహన్‌లాల్‌గంజ్‌), సాధ్వి నిరంజన్‌ జ్యోతి(ఫతేపూర్‌), శంతను ఠాకూర్‌ (పశ్చిమబెంగాల్‌లోని బంగావ్‌), ఎల్‌జేపీ(రాంవిలాస్‌) నేత చిరాగ్‌ పాశ్వాన్‌ (బిహార్‌లోని హాజీపూర్‌), శివసేన శ్రీకాంత్‌ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్‌), బీజేపీ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్‌), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌(ముంబై నార్త్‌ సెంట్రల్‌)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్‌డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్‌ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్‌ జరగనుంది. బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్‌ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది.ఆరో దశ పోలింగ్‌ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటిన జరగనుంది.

Iran Helicopter Crash Ebrahim Raisi Death Latest News
హెలికాఫ్టర్‌ క్రాష్‌.. ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం

టెహ్రాన్‌: హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్‌బైజాన్‌-ఇరాన్‌ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్‌ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం అతి కష్టం మీద హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. హెలికాఫ్టర్‌ పూర్తిగా కాలి ధ్వంసం అయినట్లు ప్రకటించాయి. క్రాష్‌ సైట్‌లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్‌ రెడ్‌ క్రెసెంట్‌ చీఫ్‌ పిర్హోస్సేన్‌ కూలివండ్‌ ప్రకటించారు.Imagens adicionais de drone mostrando uma imagem mais nítida do local da queda do falecido presidente do Irã, o helicóptero de Ebrahim Raisi, que caiu ontem no noroeste do Irã, resultando na morte de todos os passageiros. #EbrahimRaisí pic.twitter.com/TPUrzL2oGz— 💢 𝑨𝒏𝒕𝒐𝒏𝒆𝒍𝒍𝒊 𝑹𝒐𝒅𝒓𝒊𝒈𝒖𝒆𝒔 💢 (@antonellibjj) May 20, 2024అంతకు ముందు టర్కీకి చెందిన డ్రోన్లు.. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్‌ విజువల్స్‌ ద్వారా ఇరాన్‌ బలగాలకు సాయం అందించాయి.ఆదివారం అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్‌తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్‌లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే హెలికాఫ్టర్‌ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్‌ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వయత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్‌ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.

Who Is Noland Arbaugh And How Neuralink First Brain Implant
న్యూరాలింక్‌ అద్భుతం, బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్‌ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్‌లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్‌ సాయంతో కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్‌ ఛైర్‌కే2016లో సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బాగ్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్‌1 అనే చిప్‌ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బాగ్‌ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్‌ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్‌ బ్రెయిన్‌లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్‌ సంస్థ బాధితుడి బ్రెయిన్‌ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్‌ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్‌ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్‌ అర్బాగ్‌ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్‌ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్‌ మార్నింగ్‌ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్‌ చేశారు నోలాండ్‌ అర్బాగ్‌

Chandrababu to go America without Anticipatory bail
ముందస్తు బెయిల్‌ లేకుండా విదేశాలకు చంద్రబాబు

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్‌ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌తోపాటు ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్‌ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్‌!స్కిల్‌ స్కామ్‌ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్‌ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్‌ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం.

World's Greatest Wax Museum Madame Tussauds San Francisco
మేడం టుస్సాడ్‌.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?

"శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి. కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుందరాధి పోజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" ! ( హంపీక్షేత్రం కొడాలి & కామరాజుగడ్డ ) నేను శిక్షణలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి పనిగట్టుకొని హంపీ, బేలూరు, హలబెలిలకు వెళ్లి అలనాటి విజయనగర సామ్రాజ్య గతవైభవ శిథిలాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన పద్యం ఇది. అమెరికా లాస్‌ ఏంజెల్స్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ బొలివెర్డ్ లోనున్న ‘ మేడం టుస్సాడ్ వాక్స్ మ్యూజియం ’ చూశాం. అప్పుడు పదేపదే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ పద్యమే. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం 2009 లో ప్రారంభమైందట. దీని ముందున్న కింగ్ కాంగ్ పెద్ద ఆకృతి ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రదర్శించబడిన మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో , చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, బారక్ ఒబామా వంటి ఎంతోమంది ప్రముఖుల రూపాలను చూసినప్పుడు వాటిని సజీవమూర్తులా అన్నట్లుగా తయారుచేసి పెట్టిన కళాకారుల ప్రతిభాసామర్థ్యాలు మమ్మల్ని ముగ్దులను చేశాయి. అయితే అప్పట్లో అందులో నాకు ఇండియా వాళ్ళది ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఈ వాక్స్ కళను మ్యూజియం స్థాయికి అభివృద్ధి చేసిన మేడం, ఫ్రాన్స్‌కు చెందిన మేరీ టుస్సాడ్ ( 1761 - 1850 ) మూర్తికి చేతులెత్తి మొక్కాము. ఇప్పుడు మేడం టుస్సాడ్ & సన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి మ్యూజియంలను స్థాపించి ,అందులో సినిమా నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల మూర్తులను పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్నారు. నిజమే కానీ ఇవన్నీ ఉత్త మైనపు బొమ్మలు మాత్రమేనన్న విషయం మనం మరిచిపోవద్దు. వీటితో పోల్చినప్పుడు కఠిన శిలలను శిల్పాలుగా, దేవతా మూర్తులుగా, మలిచిన మన శిల్పుల గొప్పదనం అర్థమౌతుంది. ఎన్నో కాలపరీక్షలను తట్టుకొని వేలవేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిలిచివున్న మన అపురూప కళాఖండాల విలువ తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మట్టితో భిన్న భిన్న ఆకృతుల వినాయక విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న మన కళాకారుల వ్యాపారమంతా ఇప్పటికీ సరియైన ఆదరణ లేక రోడ్ల మీదనే కదా జరుగుతుంది. బ్రిటిషర్స్ పరాయి పాలకులైనా, భిన్న మతస్తులైన భారతదేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యాలైన మన శిల్ప, శాసన సంపత్తిని చాలావరకు కాపాడగలిగారు. అపాటి కృషి స్వతంత్ర భారతంలో కూడా జరుగలేదన్నది చేదునిజం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అమూల్యమైన మన ప్రాచీన శిల్పసంపద సరియైన ఆదరణకు నోచుకోకుండా శిథిలమై కాలగర్భంలో కలిసిపోతుండడం విచారకరం. వీటిని కాపాడి ఎన్ని మ్యూజియంలైనా పెట్టవచ్చు. ప్రకృతివిపత్తులు, బయటివారి దండయాత్రలు, దేశ అంతర్గత మతబేధాల వల్ల మనం ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది వాస్తవం . ఇప్పుడు ఉన్నదాన్నైనా కాపాడుకోలేక పొతే, మ్యూజియంల వంటి వాటిలో పరిరక్షించుకోలేకపోలే భావితరాలు మనల్ని క్షమించవన్న భావన నాకు మేడం టుస్సాడ్ మ్యూజియం సందర్శన ప్రేరణగా కలిగింది ! వేముల ప్రభాకర్‌(చదవండి: US : చర్మం రంగు.. కోటి తిప్పలు!)

Rain Forecast For 3 Days In Andhra Pradesh
అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరా­వతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతు­పవనాలు ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా­యని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవ­నాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతా­వరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement