breaking news
two wheelers discounts
-
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!
విజయదశమి, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా ఎక్కువ వాహనాలను విక్రయించడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ పండుగ సీజన్లో టూ వీలర్ కొనాలనుకునే వారు ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే సమాచారం ఇక్కడ చూడవచ్చు. హీరో మోటోకార్ప్ భారతదేశంలోని అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన 'హీరో స్ల్పెండర్ ప్లస్' బైక్ కొనుగోలు మీద 'బై నౌ పే ఇన్ 2024' అనే ఓ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. అంటే ఈ బైకుని ఈ ఏడాది కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎమ్ఐ మొదలవుతుంది. హార్లే డేవిడ్సన్ ప్రముఖ లగ్జరీ బైక్స్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ ఎంపిక చేసిన కొన్ని బైకుల మీద రూ.5.30 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్, స్పోర్ట్‌స్టర్ ఎస్, నైట్‌స్టర్ బైకులు ఉన్నాయి. కంపెనీ 2023 మోడల్స్‌కి మాత్రమే కాకుండా 2022 మోడల్స్‌కి కూడా ఈ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఆంపియర్ ఎలక్రిక్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంపియర్ కంపెనీ గో ఎలక్ట్రిక్ ఫెస్ట్ పేరుతో మంచి ఆఫర్స్ అందిస్తోంది. మాగ్నస్ ఈఎక్స్ మీద రూ.10 వేలు, ప్రైమస్ మీద రూ.14 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అవకాశం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద బజాజ్ ఇప్పుడు రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి రూ. 1.30 లక్షల స్కూటర్ ఇప్పుడు రూ. 1.15 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే పరిమితం చేశారు. -
బ్లాక్ మార్కెట్‌కు తరలిన టూవీలర్లు
-
బ్లాక్ మార్కెట్‌కు తరలిన టూవీలర్లు
టూ వీలర్ల అమ్మకాల మీద భారీ డిస్కౌంటులు ప్రకటించడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలు చాలావరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ద్విచక్ర వాహనాలు దొరకడం లేదు. ఒక్కోవాహనం మీద పది వేల నుంచి రూ. 22 వేల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో ఎప్పటి నుంచో బైకులు కొందామని ఆలోచనలో ఉన్న వినియోగదారులు షోరూంలకు పోటెత్తారు. పత్రికలలో కూడా ఈ డిస్కౌంట్లకు సంబంధించిన కథనాలు రావడంతో అవి చూసి అంతా వెళ్లారు. కానీ, అప్పటికే చాలా వరకు షోరూంలలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దాంతో వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. బీఎస్-3 తరహా వాహనాల అమ్మకాలకు మార్చి 31 చివరి తేదీ అని సుప్రీంకోర్టు ప్రకటించడంతో తమ వద్ద పెద్దమొత్తంలో పేరుకుపోయిన వాహనాలను వదిలించుకోడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహాలో డిస్కౌంట్లు ప్రకటించగా, దాన్ని కొందరు వ్యాపారులు అవకాశంగా మార్చుకున్నారు. ముందుగానే మార్చి 31వ తేదీతో ఇన్వాయిస్లు తయారుచేసి, వాటి మీద వాహనాల వివరాలన్నీ రాసేస్తున్నారు. ఆ తర్వాత తీరిగ్గా డిస్కౌంట్లు అయిపోయిన తర్వాత వాటిని అమ్ముకుని డిస్కౌంట్ మార్జిన్ జేబులో వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్వాయిస్ తేదీ మార్చి 31 లేదా ఆలోపు ఉంటే తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వీలుంటుంది కాబట్టి ఈ కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు.