బ్రాడ్‌బ్యాండ్‌ నిర్వచనం మార్పు | Sakshi
Sakshi News home page

బ్రాడ్‌బ్యాండ్‌ నిర్వచనం మార్పు

Published Sat, Feb 4 2023 6:19 AM

Centre raises minimum broadband speed to 2 Mbps - Sakshi

న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్‌ పర్‌ సెకండ్‌) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్‌ పర్‌ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం ప్రెసిడెంట్‌ టీవీ రామచంద్రన్‌ చెప్పారు.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్‌ ఫాస్ట్‌ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ ప్రకారం గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో సగటున మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్‌ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement