
న్యూఢిల్లీ: ఈ నెల 22 నుంచి వివిధ ఉత్పత్తులపై కొత్తగా అమల్లోకి వచ్చే సెంట్రల్ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌జీఎస్‌టీ రేట్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్‌టీ రేట్లు, సెపె్టంబర్ 22 నుంచి రెండు శ్లాబులుగా ఉంటాయి. మెజారిటీ ఉత్పత్తులకు 5 శాతం, 18 శాతం ట్యాక్స్ రేట్లే వర్తిస్తాయి.
విలాసవంతమైన ఉత్పత్తులపై మాత్రం 40 శాతం శ్లాబు ఉంటుంది. చాలా మటుకు ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉంటుందని నిపుణులు తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా వివిధ ఉత్పత్తులకు వర్తించే రేట్లపై ప్రభుత్వం స్పష్టతనిచి్చందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ తెలిపారు.