
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది.
ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు.