జీఐఎల్, ఏడీపీ డీల్‌కు సీసీఐ ఆమోదం

CCI clears GMR Airports Infra-Aeroports de Paris SA deal - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (జీఐఎల్‌), ఏరోపోర్ట్స్‌ డి ప్యారిస్‌ (ఏడీపీ) ప్రతిపాదిత ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ ప్రకారం జీఐఎల్‌ జారీ చేసే విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్లను ఏడీపీ కొనుగోలు చేయనుంది.

అటు జీఐఎల్‌లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌(జీఏఎల్‌) , జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ (జీఐడీఎల్‌) విలీ న ప్రతిపాదనకు కూడా సీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ నిర్వహణలోని ఏడీపీ అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటరుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. తన అనుబంధ సంస్థ జీఏఎల్‌ ద్వారా విమానాశ్ర యాల నిర్వహణ తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. జీఐఎల్‌కు జీఐడీఎల్‌ అనుబంధ సంస్థ.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top