కేసియో వాచీల తయారీ ఇక భారత్‌లోనూ..

Casio Watches Manufacturing in India - Sakshi

ఈ ఏడాది ఆఖరు నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం కేసియో భారత్‌లో తమ వాచీల తయారీపై దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నుంచి దేశీయంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని కేసియో ఇండియా ఎండీ హిడెకి ఇమాయ్‌ తెలిపారు. స్థానిక భాగస్వామితో కలిసి పని చేస్తున్నామని, ప్రస్తుతం నాణ్యతపరమైన మదింపు జరుగుతోందని ఆయన చెప్పారు.

2023 ఆఖరు నాటికి మేడిన్‌ ఇండియా శ్రేణి వాచీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హిడెకి వివరించారు. అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో తమ వ్యాపార వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అయిదేళ్లలో భారత విభాగం అత్యధిక వృద్ధి సాధించగలదని హిడెకి ధీమా వ్యక్తం చేశారు. కేసియోకి చెందిన జీ–షాక్, వింటేజ్‌ కలెక్షన్, ఎన్‌టైసర్‌ తదితర బ్రాండ్స్‌ వాచీల ధరలు రూ. 1,500 నుంచి రూ. 3 లక్షల వరకు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top