ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా! | Boss Wins Hearts After Buying Cooler for Struggling Employee | Sakshi
Sakshi News home page

ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!

Apr 24 2026 4:03 PM | Updated on Apr 24 2026 4:14 PM

Boss Wins Hearts After Buying Cooler for Struggling Employee

ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement