Bounce Infinity E1: ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో సంచలనం​..! రేంజ్‌ ఎక్కువే..రేటు తక్కువే..!

Book Bounce Infinity E1 Scooter By Paying A Minimal Amount Of 499 - Sakshi

బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ1’ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ లాంచ్‌తో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్ఠింది.

బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌
బైక్‌ రెంటల్‌ సర్వీసెస్‌తో పరిచయమైన బౌన్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కంపెనీ బౌన్స్‌. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటుచేసిన బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ద్వారా బ్యాటరీ ఛార్జ్‌ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్‌ స్టేషన్ల నుంచి ఫుల్‌ ఛార్జ్‌ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా 3500 బ్యాటరీ స్వాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్లను పార్క్‌ ప్లస్‌ భాగస్వామ్యంతో బౌన్స్‌ ఏర్పాటుచేయనుంది. 

ధర ఏంతంటే..!
 బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్‌ ధర రూ. 45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ స్పోర్టీ రెడ్, స్పార్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డెసాట్ సిల్వర్, కామెడ్ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో రానుంది.
చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!


బుకింగ్స్‌, డెలివరీ ఎప్పుడంటే..!

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ నుంచి రూ. 499 చెల్లించి  ప్రీ-బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూటర్లను కంపెనీ వచ్చే ఏడాది మార్చి నుంచి డెలివరీలను చేపట్టనుంది. ఈ స్కూటర్‌ కొనుగోలుపై ఫేమ్‌-2 పథకం కూడా వర్తించనుంది. కొనుగోలుదారులకు 50వేల కిమీలతోపాటు,  3 సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తోంది. 

స్కూటర్‌ పర్ఫారెమెన్స్‌..!
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 48V బ్యాటరీతో 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్‌ వేగాన్ని  8 సెకన్లలో అందుకోగలదు.


చదవండి: ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌..! ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో సరికొత్త పంథా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top