విద్యార్థులకు మార్కులు మాత్రమే సరిపోవు! | Beyond Marks, Why Emotional Intelligence And Leadership Skills Matter For Future Success, Check More Details Inside | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు మార్కులు మాత్రమే సరిపోవు!

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 10:03 AM

Beyond Marks Skills Every Student Needs for Corporate Success

మారుతున్న వ్యాపార, సాంకేతిక విభాగంలో కేవలం విద్యాపరమైన మార్కులు, మెరిట్ మాత్రమే సరిపోవని.. భావోద్వేగ మేధస్సు (ఈక్యూ), స్వయం పరిశీలన, నాయకత్వ లక్షణాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని కార్పొరేట్ రంగ నిపుణులు నొక్కిచెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లోని విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ (వీవీఐఎస్ఎం) నిర్వహించిన 21వ పీజీడీఎం బ్యాచ్ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో మాట్లాడిన సంస్థ అధ్యక్షుడు జి.ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు విద్యార్థుల్లో వ్యవస్థాపక దృక్పథం పెంపొందాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి.జయశ్రీ వి మాట్లాడుతూ.. సాంప్రదాయ ప్రమాణాలకు భిన్నంగా నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని కొత్త అధ్యయన ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. గ్లోబల్ మార్కెట్‌కు తగ్గట్టుగా మల్టీ- డిసిప్లినరీ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ద్వారా లీడర్‌షిప్ స్థానాలకు చేరుకోవచ్చని గ్లోబల్ కన్సల్టింగ్ ఎక్స్‌పర్ట్ లక్ష్మీ నాయర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement