
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది, నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటుంది.
దీనికి ఫండ్ మేనేజరుగా హార్దిక్ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్‌కి నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మార్చ్ 4 వరకు ఎన్‌ఎఫ్‌వో అందుబాటులో ఉంటుంది.
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అత్యంత నాణ్యమైన, ఎఎఎ–రేటింగ్ ఉన్న సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పిస్తుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ – సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వివరించారు.