ఇక ఎయిర్‌ప్యాడ్స్‌ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీ!

Apple supplier Foxconn wins AirPod order usd 200 million factory in India - Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్‌ ఐఫోన్‌ మేకర్‌ ఫాక్స్‌కాన్‌  భారత్‌లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర‍్డర్‌ను సాధించింది. దీంతో  ఇప్పటివరకు ఐఫోన్‌ మేకర్‌గా ఉన్న తైవాన్‌కు మేకర్‌ ఇపుడు తొలిసారి ఎయిర్‌పాడ్స్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐపోన్ల అసెంబ్లర్ ఫాక్స్‌కాన్   కొత్త ప్లాంట్‌లో ఎయిర్‌ప్యాడ్స్‌  ఉత్పత్తి  షురూ అయితే  తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్‌ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!)

రాయిటర్స్ అందిచిన రిపోర్ట్‌ ప్రకారం  దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇండియా ఎయిర్‌ప్యాడ్‌ ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్ 200 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 1,654 కోట్లు)  పైగా పెట్టుబడి పెట్టనుంది.  ఈ  ప్లాంట్  ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్‌కాన్ లక్క్ష్యం.  గత కొంతకాలంగా యాపిల్ భారత్‌లో తన కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్‌పాడ్‌లను తయారు చేయాలని అనేదానిపై ఫాక్స్‌కాన్ తీవ్రం చర్చిస్తోందని చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్‌కాన్‌ కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్‌కాన్ బుధవారం తెలిపింది. ఈ  నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్‌ప్యాడ్స్‌ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్‌లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్‌కాన్‌తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు అంచనా.  మరోవైపు ఈ వార్తలపై యాపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.  ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ  యాపిల్‌ నుండి మరిన్ని ఆర్డర్‌లను గెలుచుకోవడానికి Wistron Corp,  Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్‌కాన్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. (‘నాటు నాటు’ జోష్‌ పీక్స్‌: పలు బ్రాండ్స్‌ స్టెప్స్‌ వైరల్‌, ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా!)

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top