ఐఫోన్‌11కు స్క్రీన్ల రీప్లేస్‌మెంట్‌

Apple to replace iphone 11 model screens for free - Sakshi

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ తాజా ప్రకటన

ఐఫోన్‌ 11 మోడల్‌ ఫోన్లలో టచ్‌ సమస్యలు

2019 నవంబర్‌- 2020 మే మధ్య ఫోన్లకు మాత్రమే

సమస్యాత్మక 11 మోడల్ ఫోన్లకు ఉచితంగా స్క్రీన్‌ రీప్టేస్‌మెంట్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తయారీ ఐఫోన్ 11 వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్‌ 11 మోడల్ ఫోన్లకు స్ర్కీన్లను రీప్టేస్‌ చేయనున్నట్లు యాపిల్‌ ఇంక్‌ తాజాగా ప్రకటించింది. ఐఫోన్‌ 11 మోడళ్లలో టచ్‌ స్ర్రీన్‌ సమస్యలు ఎదురవుతుండటంతో ఉచితంగా స్క్రీన్లను మార్పు చేయనున్నట్లు తెలియజేసింది. 2019 నవంబర్‌ నుంచి 2020 మే నెల మధ్యకాలంలో తయారైన ఐఫోన్‌ 11 మోడళ్లలో ఈ సమస్యలు ఎదురవుతున్నట్లు యాపిల్‌ ఇంక్‌ వెల్లడించింది. డిస్‌ప్లే మాడ్యూల్‌లో సమస్యల కారణంగా ఈ మోడల్‌ ఐఫోన్లు కొన్నింటిలో టచ్‌ సక్రమంగా పనిచేయడంలేదని వివరించింది. 

చెక్‌ చేసుకోవచ్చు
ఐఫోన్‌ 11 మోడల్‌ వినియోగదారులు టచ్‌ స్క్రీన్‌ సమస్యలను పరిశీలించేందుకు వీలుగా యాపిల్‌ వివరాలు అందించింది. యూజర్లు ఫోన్‌ సీరియల్ నెంబర్‌ చెకర్‌ ద్వారా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌కు అర్హమైనదీ లేనిదీ తెలుసుకోవచ్చని వెల్లడించింది. యాపిల్‌ వెబ్‌సైట్‌లో రీప్లేస్‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌లో భాగంగా సీరియల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే వివరాలు కనిపించనున్నట్లు తెలియజేసింది. ఈ పరిధిలో మీ ఫోన్‌ ఉంటే యాపిల్‌ అధీకృత సర్వీసుల కేంద్రంలో ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్‌ చేయనున్నట్లు వివరించింది. ఒకవేళ ఇప్పటికే ఈ సమస్య కారణంగా సొంత ఖర్చులతో స్ర్రీన్‌ను మార్చుకున్నట్లయితే.. యాపిల్‌ను సంప్రదించడం ద్వారా రిఫండ్‌ను పొందవచ్చని తెలియజేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top