భారత్‌లో ఐఫోన్‌ల తయారీ.. యాపిల్‌ అంచనాలు తలకిందులవుతున్నాయా?

Apple Is Hitting Stumbling Blocks In Its Effort To Increase Production In India - Sakshi

భారత్‌లో ఐఫోన‍్ల iPhone తయారీ పెంచాలని భావిస్తున్న యాపిల్‌ కంపెనీ ప్రయత్నాలకు ఆదిలోనే హంస‌పాదు ఎదురైనట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. కోవిడ్‌-19 ఆంక్షలతో సప్లయ్‌ చైన్‌ సమస్యలు, అమెరికా- చైనాల మధ్య  రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫోన్‌ల తయారీని డ్రాగన్‌ కంట్రీ నుంచి భారత్‌కు తరలించేందుకు టెక్‌ దిగ్గజం యాపిల్ ప్రయత్నాలు చేసింది.

ఇందులో భాగంగా దేశీయ సంస్థ టాటా సంస్థతో యాపిల్ APPLE ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఐఫోన్‌ల విడిబాగాలను టాటా సంస్థ సగం (50%) తయారు చేసి యాపిల్‌కి ఐఫోన్‌లను సప్లయి చేసే ఫాక్స్‌కాన్‌కు అందిస్తుంది. అయితే 50 శాతం దిగుబడితో యాపిల్‌ తాను అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేదంటూ ఫైనాన్సియల్ టైమ్స్  నివేదించింది. అందుకు స్థానికంగా లాజిస్టిక్స్, టారిఫ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ కారణంగా భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రక్రియ నెమ్మదించినట్లు ఫైనాన్సియల్ టైమ్స్  పేర్కొంది. అయితే ఈ వార్తలపై టాటా గ్రూపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు, అలాగే ఖండన కూడా రాలేదు 

2017 నుంచి విస్ట్రాన్‌ ఆధ్వర్యంలో యాపిల్‌ సంస్థ భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేస్తోంది. చైనాలో పరిస్థితులు, దేశీయంగా తయారీ రంగంలో వృద్ది సాధించేలా కేంద్రం లక్ష్యాలను పెట్టుకున్న నేపథ్యంలో ఐఫోన్ల తయారీ భారత్ కు కలిసివస్తుందని అంచనా వేశారు నిపుణులు. అందుకే యాపిల్ కంపెనీ చైనానుంచి రావాలనుకున్నప్పుడు కేంద్రం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు యాపిల్‌ సంస్థ అంచనాలకు అనుగుణంగా లేవంటూ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. 

చదవండి👉 ప్రాణం లేని ఉద్యోగి .. ఏడాదికి రూ. 11లక్షల ప్యాకేజీ!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top