ఎన్‌ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ | Amitava Mukherjee takes additional charge as CMD of NMDC Ltd | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ

Mar 14 2023 3:08 AM | Updated on Mar 14 2023 3:08 AM

Amitava Mukherjee takes additional charge as CMD of NMDC Ltd - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

1995 బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ అకౌంట్స్‌ సర్వీస్‌కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్‌ఎండీసీలో చేరారు. ఎన్‌ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement