ఆకాశ ఎయిర్‌లో వెయ్యి కొలువులు

Akasa Air To Hire Roughly 1 000 People By March 2024 - Sakshi

కంపెనీ సీఈవో వినయ్‌ దూబే వెల్లడి

న్యూఢిల్లీ: కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి సుమారు 1,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ఆకాశ ఎయిర్‌ భావిస్తోంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను 3,000కు పెంచుకోనుంది. దాదాపు ఏడు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌ ఈ ఏడాది ఆఖరు నాటికి అంతర్జాతీయ రూట్లలోనూ సర్వీసులు మొదలుపెట్టాలని యోచిస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్‌ దూబే ఈ విషయాలు తెలిపారు. (మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్‌ చెయ్యాలా? కొనుక్కోవాలా?)

అంతర్జాతీయ సేవలకు సంబంధించి అనువైన దేశాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ‘మూడు అంకెల స్థాయిలో’ విమానాల కోసం ఆర్డరు ఇవ్వనున్నట్లు దూబే వివరించారు. ఆకాశ ఎయిర్‌ 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ దగ్గర 19 విమానాలు ఉండగా .. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది అందుబాటులోకి రానున్నాయి.

ఏప్రిల్‌లో వచ్చే విమానంతో కలిపి ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 20కి చేరుతుంది. తద్వారా విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు అర్హత లభిస్తుంది. తమకు ఇప్పుడు అదనపు విమానాలు లేకపోయినప్పటికీ ముందుగానే సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుందని, వారికి శిక్షణనివ్వాల్సి ఉంటుందని దూబే తెలిపారు. ప్రస్తుతం తాము రోజుకు 110 ఫ్లయిట్స్‌ నడుపుతున్నామని.. ఈ వేసవి సీజన్‌ ఆఖరు నాటికి వీటిని 150కి పెంచుకుంటామని ఆయన చెప్పారు. (శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ , అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా!)

(CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్‌... అదీ ఐపీఎల్‌కు ముందు)

(హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top