80కి పైగా నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. మీ ప్రాంతంలో సర్వీస్ ఉందా?

Airtel 5g Launched In 80 Indian Cities, Full List Of Cities - Sakshi

ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దేశం అంతటా 5జీ నెట్‌ వర్క్‌ను విడుదల చేస్తోంది. ఎయిర్‌టెల్‌ 5జీ  ప్లస్‌గా పిలిచే ఈ నెట్‌వర్క్‌ను ఇటీవల ఈశాన్య భారత దేశంలోని ఏడు కొత్త నగరాలకు 5జీ నెట్‌ వర్క్‌ కనెక్టివిటీని ప్రారంభించింది. కోహిమా, ఇటా నగర్‌, ఐజ్వాల్‌, గ్యాంగ్‌ టక్‌, సిల్చార్‌, దిబ్రూగర్‌, టిన్సుకియా యూజర్లకు ఈ ఫాస్టెస్ట్‌ నెట్‌ వర్క్‌ సర్వీసుల్ని అందించింది. ఇంతకు ముందే గౌహతి, షిల్లాంగ్‌, ఇంఫాల్‌, అగర్తల, దిమాపూర్‌తో సహా ఈశాన్య భారత దేశంలో ఇతర నగరాల్లో ప్రారంభించింది.  

తాజాగా ఏడు నగరాల్లో 5జీ ప్లస్‌ను ప్రారంభించడంతో ఎయిర్‌ టెల్‌ను వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న నగరాల సంఖ్య 80కి చేరింది. ఈ నగరాల్లో నివసించే వారు 5జీ నెట్‌ వర్క్‌ వినియోగించేందుకు వీలుగా ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లలో ఐదవ తరం నెట్‌వర్క్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్‌ హామీ ఇచ్చింది.ఈ సందర్భంగా ఎయిర్‌ టెల్‌ 5జీ ప్లస్‌ అందుబాటులోకి ఉన్న నగరాలను విడుదల చేసింది.

వాటిల్లో అస్సాం- గౌహతి, టిన్సుకియా, దిబ్రూగర్‌, సిల్చార్‌, ఆంధ్రప్రదేశలో వైజాగ్‌, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, బీహార్‌- పాట్నా, ముజఫర్‌ పూర్‌, బోద్‌ గయం, భాగల్‌ పూర్‌, బెగుసరాయ్‌, కతిహార్‌,కిషన్‌ గంజ్‌, పూర్నియా, గోపాల్‌ గంజ్‌,బార్హ్‌, బీహార్‌ షరీఫ్‌, బిహ్తా,నవాడా, సోనేపూర్‌, ఢిల్లీ, గూజరాత్‌- అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర,రాజ్‌కోట్‌ హర్యానా - గురుగ్రామ్, పానిపట్, ఫరీదాబాద్, అంబాలా, కర్నాల్, సోనిపట్, యమునానగర్, బహదూర్‌ఘర్ హిమాచల్ ప్రదేశ్- సిమ్లాలు ఉన్నాయి. 

ఇక  జమ్మూ & కాశ్మీర్- జమ్మూ, శ్రీనగర్, సాంబా, కథువా, ఉధంపూర్, అఖ్నూర్, కుప్వారా, లఖన్‌పూర్, ఖౌర్ జార్ఖండ్- రాంచీ, జంషెడ్‌పూర్, కర్ణాటక - బెంగళూరు కేరళ- కొచ్చి, త్రివేండ్రం, కోజికోడ్, త్రిస్సూర్,మహారాష్ట్ర- ముంబై, నాగ్‌పూర్, పూణే, మధ్యప్రదేశ్- ఇండోర్, మణిపూర్- ఇంఫాల్, ఒడిశా- భువనేశ్వర్, కటక్, రూర్కెలా, పూరి, రాజస్థాన్- జైపూర్, కోటా, ఉదయపూర్, తమిళనాడు- చెన్నై, కోయంబత్తూరు, మధురై, హోసూర్, తిరుచ్చి, తెలంగాణ  హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిక్కిం- గ్యాంగ్‌టక్, మిజోరాం- ఐజ్వాల్, అరుణాచల్ ప్రదేశ్- ఇటానగర్, నాగాలాండ్- కోహిమా, ఛత్తీస్‌గఢ్- రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్, త్రిపుర-అగర్తలా,ఉత్తరాఖండ్- డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్- వారణాసి, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా, ఘజియాబాద్, పశ్చిమ బెంగాల్ - సిలిగురిలలో అందుబాటులో ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top