రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఇంట్లో ఉంటేనా.. అండర్‌ వాటర్‌ ట్యాంక్‌లో నలకలు మాయం!

Aiper Seagull 3000 Robot Pool Cleaner Review - Sakshi

భారీ నీటి తొట్టెలు, ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటివి శుభ్రం చేయడం ఆషామాషీ పని కాదు. ఎంతగా శుభ్రం చేశామనుకున్నా, సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలు, నాచు మొలకలు ఎక్కడో చోట ఇంకా మిగిలే ఉంటాయి. 

ఈ ఫొటోలో కనిపిస్తున్న అండర్‌ వాటర్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ గనుక ఉంటే, వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఇది నీటి అట్టడుగు వరకు ప్రయాణించగలదు. మూల మూలల్లోని చెత్తను, 180 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలను కూడా ఇట్టే ఒడిసి పట్టుకుని, తిరిగి నీట్లోకి చేరకుండా చూస్తుంది. 

‘ఎయిపర్‌ సీగల్‌–3000’ పేరుతో జపాన్‌కు చెందిన ఎయిపర్‌ ఇంటెలిజెంట్‌ కంపెనీ రూపొందించిన ఈ అండర్‌ వాటర్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా నియంత్రించవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top