అదిరిందయ్యా అదానీ.. ‘పవర్‌’ఫుల్‌ లాభాలు!

Adani Power profit jumps to Rs 4645 crore in 2022 Q4 - Sakshi

లాభాల్లో అదానీ గత రికార్డులను తిరగ రాశాడు. కనివినీ ఎరుగని రీతిలో ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేట్‌ కంపెనీకి సాధ్యం కానీ విధంగా లాభాలను కళ్ల జూసింది అదాని పవర్‌. 2022 మార్చి 31తో ముగిసిన క్వార్టర్‌ ఫలితాలు 2022 మే 5న ప్రకటించింది అదానీ పవర్‌. ఈ తాజా ఫలితాల్లో అదానీ పవర్‌ లాభాలు రూ.4,645 ‍కోట్లుగా నమోదు అయ్యింది. అంతుకు ముందు ఏడాదికి ఇదే క్వార్టర్‌లో అదానీ పవర్‌ లాభాలు కేవలం రూ.13 కోట​‍్లుగా ఉన్నాయి. తాజా ఫలితాలతో స్టాక్‌ మార్కెట్‌లో అదానీ షేర్లు రాకెట్‌ వేగంతో పైపైకి దూసుకుపోయాయి. 

2021-22 ఆర్థిక సంవత్సంరలో అదాని పవర్‌ రెవన్యూ 13,,308 కోట్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య రూ.6,902 కోట​‍్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే అదానీ పవర్‌ లాభం 93 శాతం ఎగిసింది. ఈ ఏడాది కాలంలో ఆదాని పవర్‌ షేరు ధర రూ.97 నుంచి రూ.279.50కి పెరిగింది. ఈ షేర్లపై ఇన్వెస్ట్‌ చేసిన వారికి మంచి రిటర్నులు అందాయి. ఇటీవల ఆదాని పవర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ లక్ష కోట్ల రూపాయలను దాటింది.
 

చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top