టేకులపల్లి: ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు పశువులను తరలిస్తున్న ముఠాను టేకులపల్లి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలోని తడికలపూడి క్రాస్ వద్ద ఎస్సై కేగల తిరుపతి ఆధ్వర్యాన తనిఖీలు చేస్తుండగా, డీసీఎంలో పరిశీలించారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, ఆరు ఆవులు ఉండడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు డీసీఎంను సీజ్ చేశారు. వాహనంలోని పశువులను పాల్వంచ గోశాలకు తరలించారు. ఘటనకు హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన జలా రాజు, రంగారెడ్డి జిల్లా తట్టినాగారం వాసి ఉదరా భరత్, కంగుల రాజుతో పాటు ఒడిశాకు చెందిన జబ్దార్ హరిజపై కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.


