రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివా రం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణా న్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించా రు. వారంతపు సెలవు రోజులు రావడంతో ఆలయంలో సందడి నెలకొంది.

ప్రతిష్ఠామూర్తులకు

సంప్రోక్షణ

పాల్వంచరూరల్‌: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలో ఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయ సముదాయంలోని శివాలయంలో ప్రతిష్ఠా మూర్తులకు సంప్రోక్షణ, అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. శని వారం శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు గణపతిపూజ, పుణ్యావాచనం, దీక్షాధారణ, సంప్రోక్షణ, రుద్రాభిషేకం, మంటపారాధన, మూలమంత్రహోమాలు, నీరాజన మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకునిస్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసేందుకు మహిళలు పసుపు కొట్టి తలంబ్రాలను కలిపి సిద్ధం చేశారు. ఆలయ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు సీహెచ్‌.పాపారావు, పెండ్లి రామిరెడ్డి, సర్పంచ్‌ బి.అనిత పాల్గొన్నారు.

పొదుపు పథకాలపై ప్రచారం చేయాలి

తపాలా శాఖ ఎస్పీ వీరభద్రస్వామి

చండ్రుగొండ: తపాలా శాఖ అమలు చేస్తున్న పొదుపు పథకాలపై ప్రచారం చేయాలని ఉమ్మ డి జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి అన్నారు. చండ్రుగొండలోని తపాలా శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పోస్టుమాస్టర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికి తిరిగి పొదుపు పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. పొదుపు పథకాలపై రూపొందించిన పుస్తకాన్ని ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయితీల్లో సర్పంచ్‌లకు అందుబా టులో ఉంచామన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జీ అసిస్టెంట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ మల్లికార్జున, సిబ్బంది సత్యనారాయణ, రాంప్రసాద్‌, పణికుమార్‌ పాల్గొన్నారు.

సింగరేణిలో

బదిలీ వర్కర్లకు శుభవార్త

రుద్రంపూర్‌: సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న బదిలీవర్కర్లకు యాజమాన్యం తీపి కబురు అందించింది. గతంలో బదిలీ వర్కర్‌ నుంచి జనరల్‌ అసిస్టెంట్లుగా మారాలంటే కనీసం మూడేళ్లకాలం పట్టేంది. కానీ రానున్న మార్చి నుంచి ఎంవీటీసీ శిక్షణ పూర్తికాగానే బదిలీ వర్కర్‌కు బదులుగా జనరల్‌ అసిసెంట్లుగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ నెల 14న సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘంతో సింగరేణి యాజమాన్యం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కాగా 190/240 మస్టర్లు పూర్తికాగానే ట్రెయినీ హోదా తొలగిస్తారని ఏఐటీయూసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

జాతీయస్థాయికి ఎంపిక

దమ్మపేట: గోవాలో ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహించనున్న జాతీయస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌కు బాడ్మింటన్‌ విభాగంలో దమ్మపేట మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. నాగుపల్లి, పట్వారిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు చెందిన సీహెచ్‌.రాము, బి.వినోద్‌కుమార్‌ ఎంపిక కాగా, వారిని టీఎస్‌ యూటీఎఫ్‌ తరఫున పలువురు అభినందించారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/1

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement