మేము అమ్ముడుపోలేదు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేసీఆర్ ఆదేశమే శిరోధార్యమని, తాముఅమ్ముడుపోలేదని, గోబెల్స్ ప్రచా రా న్ని ఖండిస్తున్నామని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ఆదివారం రాత్రి తెలిపారు. ఎనిమిది మంది కార్పొరేటర్లు సమావేశమై వీడియోను విడుదల చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు సీపీఐతో పొత్తు ఉంటుందని అన్నారు. తమను నమ్మి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్ అధిష్టానం ఎంపిక చేసిందని, పార్టీకి ఎప్పటికీ రుణ పడి ఉంటామని తెలిపారు. విజయం సాధించిన కార్పొ రేటర్లమంతా ఏకతాటిపై ఉంటామని ప్రకటిస్తూ ప్రమాణం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు సిఽంధుతపస్వి, వేల్పుల వీరమ్మ, సాగర్ మల్హోత్రా, గుగులోత్ రాంబాబు, మల్లెల స్వప్నకుమారి, బత్తుల మధుచంద్, గొవ్వాడ గుణచరిత్, భీమాశ్రీవల్లి పాల్గొన్నారు. అయితే సమావేశం ఎక్కడ నిర్వహించారనేది వెల్లడించలేదు.
కొత్తగూడెం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు


