ఉత్సాహంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం సమ్మేళనం నిర్వహించారు. 40 ఏళ్ల అనంతరం కలుసుకున్న ఆనాటి విద్యార్థులు పాత జ్ఞాపకాలు, అప్పుడు వ్యవహరించిన తీరును గుర్తుచేసుకున్నారు. ఒకరికొకరు యోగ క్షేమాలు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్, కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ జీవీఆర్ లక్ష్మణ్‌రావు, భూపాలపల్లి డీఆర్‌ఆర్‌ఓ శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


