‘పుల్వామా’ వీరులకు నివాళి
ఇల్లెందు: పుల్వామాలో బస్సుపై ముష్కరులు దాడి చేయగా అమరులైన జవాన్లకు పలువురు నివాళులర్పించారు. పుల్వామా దాడి ఘటన జరిగి ఏడేళ్లు నిండగా ఇల్లెందులో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం రాత్రి భగరంగ్‌దళ్ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో డీకే.శ్రీనివాస్, రాములోనియా, పుణ్యనాయక్, రవితేజ, శివకుమార్ కండేల్ వాల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో 24కు గాను కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యాన ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవగా అభినందించారు. ఆయన వెంట ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు ఉన్నారు.
రేక్‌పాయింట్‌కు 2,638 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,638.62 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,538.62 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. మిగతా 200 మెట్రిక్ క్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
ఇసుక లారీలు సీజ్
దమ్మపేట: ఏపీలోని కొవ్వూరు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మండలానికి ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి, పట్టుకున్నారు. మండలంలోని జలవాగు గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్న ఇసుక లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, సీజ్ చేసి, మైనింగ్ శాఖకు అప్పగించామని పోలీసులు తెలిపారు.
‘పుల్వామా’ వీరులకు నివాళి
‘పుల్వామా’ వీరులకు నివాళి


