బడిలో వజ్రోత్సవం! | - | Sakshi
Sakshi News home page

బడిలో వజ్రోత్సవం!

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

బడిలో వజ్రోత్సవం!

బడిలో వజ్రోత్సవం!

మళ్లీ చిన్నతనంలోకి...

వేంసూరు ఉన్నత పాఠశాల

ఏర్పడి 75 ఏళ్లు పూర్తి

ఉత్సవాలకు పూర్వ విద్యార్థులు,

ఉపాధ్యాయులు

వేంసూరు: ఒకటి కాదు, రెండు కాదు పాఠశాల ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయింది. ఇప్పటివరకు ఇక్కడ చదివిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరారు. ఈ నేపథ్యాన వేంసూరు ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలు శనివారం నిర్వహించగా.. పూర్వవిద్యార్థులు హాజరై తాము విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలో సందడిగా గడిపారు.

పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు హాజరైన పూర్వ విద్యార్థులు మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయారు. ఉద్యో గం, కుటుంబ బాధ్యతలను పంచుకోవడమేకాక చదువుకున్నప్పుడు జరిగిన ఘటనలు గుర్తుచేసుకున్నారు. అంతేకాక తమకు పాఠాలు బోధించిన గురువులతో మాట్లాడి వారి కృషితోనే ఈ స్థాయికి చేరామని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పాఠశాల ప్రారంభం నుంచి పదో తరగతి పూర్తి చేసిన వారు బ్యాచ్‌ల వారీగా ఫొటోలు దిగుతూ ఫోన్‌ నంబర్లు మార్చుకుంటూ సంబురపడ్డారు. తొలుత బ్యాచ్‌ల వారీగా ర్యాలీలతో పాఠశాలకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement