ప్లాస్టిక్ రహితంగా మార్చాలి
● అటవీ, పర్యావరణ పరిరక్షణకు చర్యలు ● పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ
చుంచుపల్లి/అశ్వారావుపేటరూరల్: అటవీ, వన్యప్రాణుల రక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ప్లాస్టిక్ రహిత అడవులుగా మార్చాలని ప్రిన్సి పాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌స్(పీసీసీఎఫ్) డాక్టర్ సి.సువర్ణ సూచించారు. శనివారం ఆమె జిల్లాలో పర్యటించారు. కొత్తగూడెంలో భద్రాద్రి అర్బొరేటం, భద్రా మీటింగ్ హాల్‌లను ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఫీల్డ్ సిబ్బందికి బీట్ ఇన్ఫర్మేషన్ బుక్స్, హెల్మెట్లు, ఏఐటీ ఈ కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలోని గోగులపూడి వద్ద తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీగుబ్బల మంగమ్మ తల్లి ఆలయా న్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూలు చేశారు. అనంతరం ఆలయ మార్గంలో ఏర్పా టు చేసిన బేస్ క్యాంప్, చెక్‌పోస్టును ప్రారంభించారు. తిమ్మాపురం సమీపంలో 50 హెక్టార్లలో పెంచుతున్న అటవీశాఖ ప్లాంటేషన్‌ను సందర్శించారు. మొక్కల్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సహకారంతో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీసంపద సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆక్రమణలు, వన్యప్రాణివేట, అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో సీసీఎఫ్ డాక్టర్ డి. భీమానాయక్, అధికారులు కృష్ణ, కృష్ణాగౌడ్, కె.దామోదర్‌రెడ్డి, మురళీకృష్ణ, ఖమ్మం, వరంగల్ జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.


