ఆకాశవాణిలో కిసాన్‌ దివాస్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆకాశవాణిలో కిసాన్‌ దివాస్‌..

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

ఆకాశవాణిలో కిసాన్‌ దివాస్‌..

ఆకాశవాణిలో కిసాన్‌ దివాస్‌..

చుంచుపల్లి: కొత్తగూడెం రేడియో స్టేషన్‌లో శని వారం కిసాన్‌వాణి రేడియో కిసాన్‌ దివాస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రేడి యో కేంద్రం ప్రాంగణంలో పలు ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన ప్రకృతి మాత గ్రీన్‌ గార్డెన్‌ను స్టేషన్‌ ప్రోగ్రాం హెడ్‌ కొలిపాక శంకరరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. బాబూరావు, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టీ.భరత్‌ , జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌, రామవరం పశు వైద్యుడు డాక్టర్‌ జి. ఆనందరావు, పలువురు ఆదర్శ, అభ్యుదయ రైతులు పాల్గొని మాట్లాడారు. సమీకృత వ్యవసాయంతోనే రైతుల అభవృద్ధి సాధ్యమని, పంటలతో పాటుగా చేపలు, కోళ్లు, మేకల పెంపకం చేపట్టాలని సూచించారు. అనంతరం పలువురు అభ్యుదయ రైతులను, అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు గొట్టిపాటి వెంకటేశ్వర్లు, నర్సి రెడ్డి, క్రీస్తు రాజు, సందీప్‌, హనుమా, మొక్కల పెంపకందారులు నూర్వి రాజశేఖర్‌, రామంచి శ్రీని వాస్‌, రేడియో స్టేషన్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది బాబు సింగ్‌, సుమన్‌, ఆనంద్‌, కోటేశ్వరరావు, రేడియో జాకీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement