యువకుడి మృతిపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యువకుడి మృతిపై ఆందోళన

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

యువకుడి మృతిపై  ఆందోళన

యువకుడి మృతిపై ఆందోళన

రుద్రంపూర్‌: సింగరేణి కార్మికుడి కుమారుడి మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేపట్టారు. కొత్తగూడెం ఏరియా పరిధి పీవీకే–5 ఇంక్‌లైన్‌ గనిలో కన్వేయర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాల నాగేశ్వరరావు కుమారుడు నవీన్‌ (29) పాల్వంచలో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. నవీన్‌ రెండేళ్ల నుంచి బోన్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. శనివారం సింగరేణి ఆస్పత్రికి చికిత్స కోసం రాగా.. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారు. అంబులెన్స్‌లో పంపించగా.. మార్గమధ్యలో నవీన్‌ మృతి చెందాడు. దీంతో అతడి మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కుటుంబ సబ్యులు, ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేశారు. రమణమూర్తి, హుమాయిన్‌, రాము, రాజేశ్వరరావు, నరేశ్‌, మురళి, రవీందర్‌, శ్యామ్‌, ప్రశాంత్‌, నాగయ్య, క్రిష్టాఫర్‌, నితిన్‌, ఎర్రగాని కృష్ణయ్య, ఓం వాసు, మడిపెల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement