విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గుండాల: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన ఈసం అనిల్ (27) కొంతకాలంగా డైలీవేజ్ విద్యుత్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. యాపలగడ్డ సమీపంలోని డబుల్ బెడ్‌రూంల వద్ద ట్రాన్మ్‌పార్మర్ పనిచేయడం లేదని గ్రామస్తులు తెలపడంతో ఎల్‌సీ తీసుకోకుండానే ఫీజు మార్చేందుకు వెళ్లిన అనిల్.. విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. స్థానికులు 108 ద్వారా గుండాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సైదారవూఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆడుకుంటూ గాయపడిన చిన్నారి మృతి..
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన కుంజా రమ్య (4) ఆడుకుంటూ గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ నెల 16న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ఆడుకుంటుండ గా రమ్యకు దెబ్బలు తగిలాయి. భద్రాచలం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. చిన్నారి మృతి విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలో బుధవా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కంపగూడెంనకు చెందిన చాపావీరస్వామి (69)తన బైక్‌పై కొత్తగూడెం గరీబ్‌పేట కు వెళ్తున్నాడు. తాటిబుచ్చన్నగూడెం శివారులో గుర్తుతెలి యని వాహనం ఢీకొట్టడంతో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ విజయసింహారెడ్డి ఘటనాస్థలిని సందర్శించి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
ములుగు జిల్లా ప్రమాదంలో యువకుడు..
భార్యాబిడ్డలను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఘటన
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి సమీపాన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంనకు చెందిన పానెం ప్రకాశ్(28) భార్య నదియ సంక్రాంతికి పిల్లలతో సహా ములు గు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలోని పుట్టింటికి వెళ్లింది. వీరిని తీసుకొచ్చేందుకు ప్రకాశ్ బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలోని చుంచుపల్లి శివారులో సోలం అరుణ్‌కుమార్, నందకిశోర్, సంజయ్ మంగపేట వైపు నుంచి ఏడూళ్లబయ్యారం వెళ్తూ రాంగ్ రూట్‌లో ప్రకాశ్ బైక్‌ను ఢీకొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా వారికి గాయాలయ్యాయి.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


