విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్
కొణిజర్ల: పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యాన నిపుణులతో రూపొందించిన గణి తం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్‌ను బుధవా రం కొణిజర్లని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ మోహనకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు రాణించాలని, నిరుపేద విద్యార్థులకు అండగా నిలవాలనే లక్ష్యంతో సాక్షి యాజమాన్యం ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం శాంతకుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ రీజినల్ మేనేజర్ అబ్దుల్లా, ఏసీఓ అచ్చెన రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


